1. పరిచయం:

    Si Creva క్యాపిటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఇది కంపెనీల చట్టం, 2013 నిబంధనల క్రింద స్థాపించబడింది, దీని కార్పొరేట్ గుర్తింపు సంఖ్య CIN: U65923MH2015PTC266425 (“Si Creva” / “కంపెనీ”). Si Creva అనేది వ్యవస్థ పరంగా ముఖ్యమైన డిపాజిట్ స్వీకరించని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ, దీని రిజిస్ట్రేషన్ నంబర్ N-13.02129 మరియు ఎప్పటికప్పుడు సవరించబడే మాస్టర్ డైరెక్షన్ – నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ – వ్యవస్థ పరంగా ముఖ్యమైన డిపాజిట్ స్వీకరించని కంపెనీ మరియు డిపాజిట్ స్వీకరించే కంపెనీ (రిజర్వ్ బ్యాంక్) డైరెక్షన్లు, 2016 మరియు ఈ అంశంకి సంబంధించి ఎప్పటికప్పుడు జారీ చేయబడే ఇతర నియమాలు, రెగ్యులేషన్లు, డైరెక్షన్లు, సర్క్యులర్లు, నోటిఫికేషన్లు మరియు ఆర్డర్లు (“RBI ఆదేశాలు”) ప్రకారం రిజిస్టర్ చేయబడింది మరియు నియంత్రించబడుతుంది.

    Si Creva వ్యవస్థ పరంగా ముఖ్యమైన NBFC అయిన సంవత్సరం నుండి దాని సమ్మతి బాధ్యతలు విస్తరించాయి.

    Si Creva కన్స్యూమర్ మరియు పర్సనల్ లోన్లను అందించే వ్యాపారాన్ని నిర్వహిస్తుంది.

  2. ఉద్దేశ్యం మరియు లక్ష్యం:

    1. 2.1. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) సెప్టెంబర్ 28, 2006 నాటి తన నోటిఫికేషన్ నంబర్ DNBS (PD) CC No.80/03.10.042/2005-06 ద్వారా, తదనంతరం వివిధ ఇతర నోటిఫికేషన్ల ద్వారా అన్ని నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (“NBFCలు”) డైరెక్టర్ల బోర్డు ద్వారా అనుసరించబడవలసిన మరియు ఆమోదించబడవలసిన న్యాయమైన విధానాల పై విస్తృత మార్గదర్శకాలను నిర్దేశించింది. ఇవన్నీ జూలై 1, 2015 నాటి మాస్టర్ సర్క్యులర్ – న్యాయమైన విధానాల నియమావళి నోటిఫికేషన్ నంబర్ DNBR.(PD).CC.No.054/03.10.119/2015-16 లో ఏకీకృతం చేయబడ్డాయి. ఫలితంగా, RBI మార్గదర్శకాలకు అనుగుణంగా, ఈ డాక్యుమెంట్‌లో కవర్ చేయబడే ఈ సమగ్ర న్యాయమైన విధానాల నియమావళి (“నియమావళి”)ని Si Creva రూపొందించింది.
    2. 2.2. ఈ నియమావళి ఇతర విషయములతో పాటు కస్టమర్లకు Si Creva ద్వారా అందించబడే ఆర్థిక సౌకర్యాలు మరియు సేవలకు సంబంధించి Si Creva ద్వారా అనుసరించబడే విధానాల ఉపయుక్తమైన సమీక్షను కస్టమర్లకు అందిస్తుంది. ఇంకా, కస్టమర్లు పొందిన ఆర్థిక సౌకర్యాలు మరియు సేవలకు సంబంధించి ఈ నియమావళి ఒక అవగాహనపూర్వక నిర్ణయం తీసుకోవడానికి మరియు Si Creva మంజూరు చేసే మరియు పంపిణీ చేసే ఏదైనా రుణానికి వర్తిస్తుంది.
    3. 2.3. ఈ నియమావళి ఈ కారణాల కోసం రూపొందించబడింది: (క) కస్టమర్లతో నిర్వహించే వ్యవహారాలలో కనీస ప్రమాణాలను ఏర్పాటు చేయడం ద్వారా సముచితమైన, న్యాయమైన మరియు విశ్వసనీయమైన విధానాలను ప్రోత్సహించడం; (ఖ) కస్టమర్లు సేవల నుండి సహేతుకంగా ఆశించగల అంశాల గురించి మెరుగైన అవగాహన కలిగి ఉండడానికి పారదర్శకతను పెంచడం. (గ) కస్టమర్లు మరియు Si Creva మధ్య ఒక న్యాయమైన మరియు స్నేహపూర్వక సంబంధాన్ని ప్రోత్సహించడం. (ఘ) Si Crevaలో కస్టమర్ ఆత్మవిశ్వాసాన్ని ప్రోత్సహించడం.
  3. కీలక నిబద్ధతలు మరియు ప్రకటనలు:

    Si Creva తన కస్టమర్ల పట్ల ఈ క్రింది కీలక నిబద్ధతలతో వ్యవహరిస్తుంది:

    1. 3.1. కస్టమర్లతో వ్యవహరించేటప్పుడు ఈ చర్యలు చేపట్టడం ద్వారా Si Creva న్యాయంగా మరియు సహేతుకంగా వ్యవహరిస్తుంది:

      1. 3.1.1. Si Creva అందించే ఆర్థిక ఉత్పత్తులు మరియు సేవలు మరియు దాని సిబ్బంది అనుసరించే పద్ధతులు మరియు విధానాల కోసం ఈ నియమావళిలో పేర్కొనబడిన నిబద్ధతలు మరియు ప్రమాణాలను అందుకోవడం;
      2. 3.1.2. వారి ఉత్పత్తులు మరియు సేవలు సంబంధిత చట్టాలు మరియు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయి అని నిర్ధారించుకోవడం;
      3. 3.1.3. సమగ్రత మరియు పారదర్శకత యొక్క నైతిక సూత్రాల ఆధారంగా కస్టమర్లతో వ్యవహారాలను నిర్వహించడం;
      4. 3.1.4. వృత్తిపరమైన, మర్యాదపూర్వక మరియు వేగవంతమైన సేవలను అందించడం;
      5. 3.1.5. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి షరతులు మరియు నిబంధనలు; వ్యయాలు, హక్కులు మరియు లయబిలిటీలను ఖచ్చితముగా మరియు సకాలంలో అందించడం.
    2. 3.2. మా ఆర్థిక ఉత్పత్తులు మరియు సేవల పనితీరు గురించి కస్టమర్ అర్థం చేసుకోవడానికి Si Creva ఈ చర్యలు చేపడుతుంది –
      1. 3.2.1. ఆర్థిక పథకాలు మరియు అన్ని ఇతర సమాచారాల గురించి హిందీ మరియు/లేదా ఇంగ్లీష్‌లో మరియు/లేదా రుణగ్రహీతకు అర్థం అయ్యే భాషలో మౌఖిక సమాచారాన్ని అందించడం;
      2. 3.2.2. మా ప్రకటనలు మరియు ప్రచార సాహిత్యం స్పష్టంగా ఉందని మరియు తప్పుదారి పట్టించే విధంగా ఉండకుండా చూడడం;
      3. 3.2.3. లావాదేవీల యొక్క ఆర్థిక పరిణామాలను వివరించడం;
      4. 3.2.4. ఆర్థిక పథకాన్ని ఎంచుకోవడానికి కస్టమర్‌కు సహాయపడడం.
    3. 3.3. పొరపాటు జరిగినప్పుడు ఈ చర్యలు చేపట్టడం ద్వారా Si Creva వేగంగా మరియు క్రియాశీలంగా వ్యవహరిస్తుంది:
      1. 3.3.1. వేగంగా తప్పులను సరిదిద్దడం;
      2. 3.3.2. కంపెనీ నిర్దేశించిన కస్టమర్ ఫిర్యాదు పరిష్కార విధానం ప్రకారం వేగంగా కస్టమర్ ఫిర్యాదులను చేపట్టడం;
      3. 3.3.3. కస్టమర్లు ఇప్పటికీ మా సహాయంతో సంతృప్తి చెందకపోతే వారి ఫిర్యాదులను ఎలా ముందుకు తీసుకువెళ్లాలో మా కస్టమర్లకు చెప్పడం;
      4. 3.3.4. మా పొరపాటు కారణంగా మేము విధించిన ఏవైనా ఛార్జీలను రద్దు చేయడం.
    4. 3.4. Si Creva ఈ నియమావళికి ప్రచారం కలిపిస్తుంది, ఇంగ్లీష్ భాషలో మరియు సాధ్యమైన అన్ని ప్రధాన స్థానిక దేశ భాషలలో/ రుణగ్రహీతకి అర్థం అయ్యే భాషలో Si Creva వెబ్‌సైట్‌లో ప్రదర్శిస్తుంది మరియు కస్టమర్ అభ్యర్థన పై కాపీలను అందుబాటులో ఉంచుతుంది.
  4. లోన్ అప్లికేషన్లు మరియు ప్రాసెసింగ్
    1. 4.1. రుణగ్రహీతలకు అన్ని వర్తమానాలు స్థానిక భాషలో లేదా రుణగ్రహీత అర్థం చేసుకున్న భాషలో అందించబడతాయి.
    2. 4.2. తమ రుణం అభ్యర్థన లేఖ లేదా రుణం అప్లికేషన్ ఫారంల ద్వారా అప్పు తీసుకోవలసిన అవసరాన్ని వ్యక్తం చేసే అర్హత కలిగిన అప్లికెంట్లకు Si Creva క్రెడిట్ అందిస్తుంది.
    3. 4.3. Si Creva ద్వారా జారీ చేయబడిన లోన్ అప్లికేషన్ ఫారంలలో రుణగ్రహీత యొక్క ఆసక్తిని ప్రభావితం చేసే అవసరమైన సమాచారం ఉంటుంది, తద్వారా ఇతర NBFCలు అందించే షరతులు మరియు నిబంధనలతో అర్థవంతమైన పోలిక చేయవచ్చు మరియు రుణగ్రహీత తెలివైన నిర్ణయం తీసుకోవచ్చు.
    4. 4.4. అన్ని రుణం అప్లికేషన్ల కోసం Si Creva ఒక రసీదును జారీ చేస్తుంది. అవసరమైన అన్ని డాక్యుమెంట్లు మరియు సమాచారం అందుకోవడానికి లోబడి, అప్లికేషన్ ఫారం అందుకున్న తేదీ నుండి అన్ని విధాలుగా పూర్తి అయిన లోన్ అప్లికేషన్లు 30 (ముప్పై) రోజులలోపు పరిష్కరించబడతాయి. ఏ సందర్భంలోనైనా, తన అప్లికేషన్ యొక్క స్థితికి సంబంధించి ఎప్పటికప్పుడు సేల్స్ పర్సన్ ద్వారా కస్టమర్‌కి తెలియజేయబడుతుంది. అప్లికేషన్ స్థితి పై అప్‌డేట్ పొందడానికి కస్టమర్ నిర్దేశించబడిన టోల్-ఫ్రీ నంబర్ లేదా ఇమెయిల్ ID వద్ద Si Creva యొక్క కస్టమర్ సర్వీస్ బృందాన్ని కూడా సంప్రదించవచ్చు.
    5. 4.5. ఏవైనా అదనపు వివరాలు/డాక్యుమెంట్లు అవసరమైతే, వాటి గురించి రుణగ్రహీతలకు వెంటనే తెలియజేయబడుతుంది.
    6. 4.6. Si Creva తన ఉద్యోగుల ద్వారా లేదా దాని ద్వారా నియమించబడిన వ్యాపార భాగస్వామి ద్వారా, కస్టమర్ యొక్క టెలిఫోన్ నంబర్లను సంప్రదించడం ద్వారా/లేదా లోన్ అప్లికేషన్ పై పేర్కొన్న నివాస/వ్యాపార చిరునామాను భౌతికంగా సందర్శించడం ద్వారా కాంటాక్ట్ పాయింట్ ధృవీకరణను నిర్వహిస్తుంది.
    7. 4.7. అప్లికెంట్ యొక్క అప్లికేషన్ తిరస్కరణకు గల కారణాల గురించి కంపెనీ అతనికి/ఆమెకి తెలియజేస్తుంది.
  5. వివక్ష రహిత పాలసీ

    Si Creva ఇప్పటికే ఉన్న మరియు సంభావ్య కస్టమర్ల పట్ల లింగం, జాతి లేదా మతం ఆధారంగా ఏదైనా వివక్షతను కలిగి ఉండటం నుండి ఖచ్చితముగా నిషేధించబడింది.

  6. రుణ మదింపు మరియు నిబంధనలు/షరతులు

    1. 6.1. రుణగ్రహీత యొక్క క్రెడిట్ యోగ్యత పై Si Creva సమగ్ర పరిశీలనను నిర్వహిస్తుంది, ఇది అప్లికేషన్ పై నిర్ణయం తీసుకోవడానికి ఒక ముఖ్యమైన ప్రమాణం అవుతుంది. అంచనా అనేది Si Creva యొక్క క్రెడిట్ పాలసీలు, నియమాలు మరియు వాటికి సంబంధించిన విధానాలను అనుసరించి ఉంటుంది.
    2. 6.2. మంజూరు చేయబడిన రుణం మొత్తం గురించి మంజూరు లేఖ లేదా ఇతర విధానం ద్వారా రుణగ్రహీత అర్థం చేసుకునే విధంగా హిందీ లేదా ఇంగ్లీష్ లేదా స్థానిక భాషలో రుణగ్రహీతకు వ్రాతపూర్వకంగా తెలియజేయబడుతుంది. పేర్కొన్న లేఖలో వార్షిక వడ్డీ రేటు మరియు వాటి అమలు చేసే పద్ధతితో సహా షరతులు మరియు నిబంధనలు ఉంటాయి. రుణగ్రహీత ద్వారా ఈ షరతులు మరియు నిబంధనల అంగీకారం యొక్క రికార్డును Si Creva భద్రపరుస్తుంది.
    3. 6.3. రుణాల మంజూరు/ పంపిణీ సమయంలో రుణగ్రహీతలు అందరికీ రుణ డాక్యుమెంట్లలో పేర్కొనబడిన అన్ని కాగితాల కాపీలతో సహా హిందీ లేదా ఇంగ్లీష్ లేదా రుణగ్రహీతకు అర్థం అయ్యే స్థానిక భాషలో రుణం యొక్క షరతులు మరియు నిబంధనలు ఉన్న లోన్ డాక్యుమెంట్ల కాపీ (“లోన్ డాక్యుమెంట్లు”) ని Si Creva తప్పకుండా అందించడానికి కట్టుబడి ఉంది. లోన్ డాక్యుమెంట్లు మరియు రుణగ్రహీతలు అందరికీ అందించబడిన అన్ని కాగితాలలో షరతులు మరియు నిబంధనలు మరియు వడ్డీ రేటును కలిగి ఉంటాయని Si Creva నిశ్చయపరుస్తుంది. అంతేకాకుండా, చెల్లింపు ఆలస్యం అయిన పక్షంలో విధించబడే జరిమానా గురించి Si Creva లోన్ డాక్యుమెంట్లలో పెద్ద అక్షరాలలో పేర్కొంటుంది.
  7. షరతులు / నిబంధనలలో మార్పులతో సహా రుణాల పంపిణీ

    1. 7.1. వడ్డీ రేట్లు మరియు ప్రాసెసింగ్ మరియు ఇతర ఛార్జీలు అధికంగా లేకుండా ఉండే విధంగా నిర్ణయించడానికి మరియు నిర్ధారించడానికి Si Creva తగిన అంతర్గత సూత్రాలు మరియు విధానాలను రూపొందిస్తుంది. పంపిణీ సమయంలో వడ్డీ రేటు మరియు రుణాలు మరియు అడ్వాన్సులపై ప్రాసెసింగ్ మరియు ఇతర ఛార్జీలు పైన పేర్కొన్న అంతర్గత సూచనలు మరియు విధానాలకు ఖచ్చితముగా లోబడి ఉండే విధంగా Si Creva నిశ్చయపరుస్తుంది.
    2. 7.2. మంజూరు యొక్క అన్ని షరతులు మరియు నిబంధనలకు రుణగ్రహీత సమ్మతిని తెలిపిన తరువాత పంపిణీ వెంటనే చేయబడుతుంది. పంపిణీ షెడ్యూల్, వడ్డీ రేట్లు, సర్వీస్ ఛార్జీలు, ముందస్తు చెల్లింపు ఛార్జీలు మొదలైన వాటితో సహా షరతులు మరియు నిబంధనలలో ఏవైనా మార్పు గురించి Si Creva రుణగ్రహీతకు స్థానిక భాష / రుణగ్రహీతకు అర్థం అయిన భాషలో అందిస్తుంది. వడ్డీ రేట్లలో మరియు ఛార్జీలలో ఈ మార్పుల ప్రభావం భవిష్యత్తు కాలంలో మాత్రమే ఉండే విధంగా Si Creva నిశ్చయపరుస్తుంది. దీనికి సంబంధించి ఒక నిబంధన లోన్ డాక్యుమెంట్లలో పొందుపరచబడుతుంది.
  8. పంపిణీ తర్వాత పర్యవేక్షణ

    1. 8.1. లోన్ డాక్యుమెంట్ల క్రింద రీకాల్/చెల్లింపు లేదా పనితీరును వేగవంతం చేయడానికి ఏదైనా నిర్ణయం అనేది లోన్ డాక్యుమెంట్లకు అనుగుణంగా ఉంటుంది.
    2. 8.2. రుణగ్రహీత ద్వారా అందించబడిన అన్ని సెక్యూరిటీలు అన్ని బకాయిలను తిరిగి చెల్లించిన తరువాత లేదా ఏదైనా చట్టపరమైన హక్కుకు లోబడి రుణం యొక్క బకాయి మొత్తాన్ని నగదు రూపంలోకి మార్చుట లేదా రుణగ్రహీత పై ఉన్న ఏదైనా ఇతర క్లెయిమ్ కోసం Si Creva ధరావతుగా పెట్టుకునే హక్కు కోసం విడుదల చేయబడతాయి. ధారణాధికార హక్కును వినియోగించుకునే పక్షంలో, దాని గురించిన పూర్తి వివరాలతో మిగిలి ఉన్న క్లెయిమ్లు మరియు సంబంధిత క్లెయిమ్ సెటిల్ చేయబడే వరకు/ చెల్లించబడే వరకు Si Creva సెక్యూరిటీలను నిలిపి ఉంచుకునే నిబంధనల గురించి ఒక నోటీసు రుణగ్రహీతకు అందించబడుతుంది.
  9. వడ్డీ రేటు మరియు ప్రాసెసింగ్ ఫీజు

    1. 9.1. వడ్డీ రేట్లు మరియు ప్రాసెసింగ్ మరియు ఇతర ఛార్జీలు, ఏవైనా ఉంటే, వాటిని నిర్ణయించడానికి తగిన అంతర్గత నియమాలను మరియు విధానాలను Si Creva రూపొందిస్తుంది మరియు అవి అధికంగా ఉండకుండా జాగ్రత్త పడుతుంది. పంపిణీ సమయంలో రుణాలు మరియు అడ్వాన్సుల పై వడ్డీ రేటు మరియు ఇతర ఛార్జీలు, ఏవైనా ఉంటే, అవి పైన సూచించబడిన అంతర్గత నియమాలు మరియు విధానాలను ఖచ్చితంగా అనుసరించే విధంగా Si Creva నిశ్చయపరుస్తుంది.
    2. 9.2. Si Creva అప్లికేషన్ ఫారం/ లోన్ అగ్రిమెంట్‌లో రుణగ్రహీతకు వడ్డీ రేటును తెలియజేస్తుంది మరియు మంజూరు లేఖలో దానిని స్పష్టంగా తెలియజేస్తుంది.
    3. 9.3. సాధారణ ఉత్పత్తుల విషయంలో వడ్డీ రేట్ల విస్తృత శ్రేణి మరియు రిస్కుల శ్రేణీకరణ కోసం విధానం కూడా Si Creva వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచబడుతుంది. వెబ్‌సైట్‌లో ప్రచురించబడిన లేదా ఇతర విధాల ప్రచురించబడిన సమాచారం వడ్డీ రేట్లలో మార్పు ఉన్నప్పుడు అప్‌డేట్ చేయబడుతుంది.
    4. 9.4. వడ్డీ రేటు ఒక సంవత్సరం ప్రాతిపదికన ఉన్న రేట్లుగా చూపబడతాయి, తద్వారా అకౌంటు నుండి వసూలు చేయబడే ఖచ్చితమైన రేట్ల గురించి రుణగ్రహీతకు అవగాహన ఉంటుంది.
    5. 9.5. నిధుల యొక్క వ్యయం, మార్జిన్ మరియు రుణాలు మరియు అడ్వాన్సుల కోసం వసూలు చేయబడే వడ్డీ రేటును నిర్ణయించేందుకు రిస్క్ ప్రీమియం పరిగణనలోకే తీసుకునే ఒక వడ్డీ రేటు నమూనా Si Creva ద్వారా పేర్కొనబడుతుంది.
    6. 9.6. వసూలు చేయవలసిన వడ్డీ రేటు రుణగ్రహీత యొక్క రిస్క్ యొక్క శ్రేణీకరణ పై అధికంగా ఆధారపడి ఉంటుంది అంటే ఆర్థిక శక్తి, వ్యాపారం, వ్యాపారాన్ని ప్రభావితం చేసే రెగ్యులేటరీ పరిస్థితులు, పోటీ, రుణగ్రహీత యొక్క గత చరిత్ర మొదలైనవి.
    7. 9.7. ప్రాసెసింగ్ ఫీజు, ఏదైనా ఉంటే, క్రెడిట్ మదింపు, డాక్యుమెంటేషన్ పరిమాణం మరియు లావాదేవీలో ప్రమేయంగల ఇతర ఖర్చుల ఆధారంగా నిర్ణయించబడుతుంది. మార్కెట్ పరిస్థితులు మరియు రెగ్యులేటరీ నిబంధనలలో మార్పుల కారణంగా సందర్భానుసారం వడ్డీ రేటు మార్పునకు లోబడి ఉంటుంది మరియు ప్రతి కేసు ప్రాతిపదికన మేనేజ్‌మెంట్ యొక్క విచక్షణాధికారానికి లోబడి ఉంటుంది.
    8. 9.8. రుణగ్రహీతలకు వ్యయ రహిత ఆన్‌లైన్ రీపేమెంట్ గేట్‌వే ను కంపెనీ అందిస్తుంది.
  10. జనరల్

    1. 10.1. రుణగ్రహీతతో కుదుర్చుకున్న రుణ ఒప్పందంలో అందించబడిన ఉద్దేశాల కోసం మినహా Si Creva రుణ గ్రహీత యొక్క వ్యవహారాలలో జోక్యం చేసుకోదు, అయితే రుణగ్రహీత గతంలో వెల్లడించని కొత్త సమాచారం Si Creva దృష్టికి వస్తే జోక్యం చేసుకుంటుంది.
    2. 10.2. రుణాల రికవరీ విషయంలో, రుణాల రికవరీ కోసం Si Creva రుణగ్రహీతలను ఇబ్బందికరమైన సమయాల్లో బాధించడం/ బల ప్రయోగం చేయడం వంటి వేధింపులకు పాల్పడదు.
    3. 10.3. తన సెక్యూరిటీ యొక్క అమలు, మూల్య నిర్ధారణ మరియు దానిని నగదులోకి మార్చే ప్రక్రియ మొత్తం న్యాయంగా మరియు పారదర్శకంగా ఉండే విధంగా Si Creva నిశ్చయపరుస్తుంది.
    4. 10.4. కస్టమర్లతో మర్యాదపూర్వకంగా వ్యవహరించే విధంగా సిబ్బందికి తగిన శిక్షణ అందే విధంగా Si Creva నిశ్చయపరుస్తుంది.
    5. 10.5. రుణగ్రహీత అకౌంటు బదిలీ కోసం రుణగ్రహీత నుండి అభ్యర్థన అందుకున్న సందర్భంలో, సమ్మతి లేదా అన్యధా అనగా Si Creva యొక్క ఆక్షేపణ, ఏదైనా ఉంటే, అటువంటి అభ్యర్థన అందుకున్న తేదీ నుండి 21 (ఇరవై-ఒక) రోజుల్లోపు తెలియజేయబడుతుంది. అటువంటి బదిలీ చట్టానికి అనుగుణంగా పారదర్శక ఒప్పంద నిబంధనల ప్రకారం ఉంటుంది.
  11. కస్టమర్ ఫిర్యాదు పరిష్కార యంత్రాంగం

    కస్టమర్ ఫిర్యాదు పరిష్కారం (“నివృత్తి పాలసీ”) బోర్డు ద్వారా అనుసరించబడుతుంది మరియు రుణగ్రహీతల అన్ని టచ్ పాయింట్లు/హెడ్ ఆఫీస్ మరియు Si Creva వెబ్‌సైట్‌లో ప్రదర్శింపబడుతుంది, ఇది కస్టమర్లకు ఎస్కలేషన్ మెకానిజం మరియు ఫిర్యాదు పరిష్కార అధికారి (పేరు మరియు సంప్రదింపు వివరాలతో సహా) గురించి తెలియజేస్తుంది.

  12. ఈ నియమావళి మరియు మేనేజ్‌మెంట్ యొక్క వివిధ స్థాయిలలో ఫిర్యాదు పరిష్కార యంత్రాంగం యొక్క నిర్వహణ గురించి నియమిత కాలపు సమీక్షను Si Creva చేపడుతుంది మరియు అటువంటి సమీక్షల ఏకీకృత నివేదిక క్రమం తప్పకుండా కంపెనీ యొక్క బోర్డు ఆఫ్ డైరెక్టర్లకు సమర్పించబడుతుంది.

నియమావళి యొక్క స్ఫూర్తిని అనుసరిస్తూ మరియు వ్యాపారానికి వర్తించే విధంగా Si Creva ఈ నియమావళికి కట్టుబడి ఉంటుంది.